Reading Time: < 1 minute
Pbks Vs Srh Playing 11 Punjab Kings Opt To Bowl Sunrisers Make Two Key Changes In Ipl 2026

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డే మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని, తర్వాతి ఇన్నింగ్స్‌లో దానికి అనుగుణంగా ఆడాలని భావించినట్లు అయ్యర్ తెలిపాడు. జట్టులో యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితులను మనం నియంత్రించలేమని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని చెప్పాడు. నేహాల్ స్థానంలో ప్రియాంశ్‌ను తీసుకున్నట్లు శ్రేయస్ వెల్లడించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని తెలిపాడు. పిచ్ బాగానే కనిపిస్తోందని, తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేయడం కీలకమని పేర్కొన్నాడు. ప్యాట్ కమిన్స్ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం జట్టుకు కొంత లోటే అయినప్పటికీ.. యువ బౌలర్లతో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ జట్టులోకి రాగా.. జయదేవ్ ఉనద్కట్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడు.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్‌ రెడ్డి, హర్ష్‌ దూబే, శివాంగ్‌ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య, ప్రభ్‌ సిమ్రన్ సింగ్ (కీపర్), కూపర్ కనోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్‌, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:
హైదరాబాద్‌: కమిందు మెండిస్, జయ్‌దేవ్ ఉనద్కత్, ప్రఫుల్ హింగే, లియామ్‌ లివింగ్‌స్టోన్, శివమ్‌ మావి.
పంజాబ్: నెహాల్ వధేరా, విష్ణు వినోద్, సుయాంశ్ షెగ్డె, యశ్ రవిసింగ్‌ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్.