
ఎట్టకేలకు ఇరాన్, అమెరికా పాక్ మధ్యవర్తిత్వంతో యుద్ధానికి బ్రేక్ వేసేందుకు శాంతి చర్చలకు అంగీకరించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నెలరోజులకు పైగా కొనసాగుతున్న గందరగోళ ఆర్థిక వాతావరణానికి బ్రేక్ పడింది. తాజా పరిస్థితులతో యుద్ధం దాదాపుగా ముగింపునకు వచ్చినట్లేనని నిపుణులు భావిస్తున్న వేళ బులియన్ మార్కెట్లు తిరిగి ఇన్వెస్టర్ల జోరును చూస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా తమ ప్రాంతంలోని తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఏప్రిల్11న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.49 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 284గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 010గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్11, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 65వేల వద్ద మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి.