Reading Time: 2 minutes
Tollywood: యాంకర్ సుమ నాకు కజిన్.. కానీ కలవనదీ.. మాట్లాడనదీ అందుకే..

నటి ఇందు ఆనంద్ తన కేరళ మూలాల నుంచి సినీ రంగ ప్రవేశం వరకు జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆమె కుటుంబం కేరళకు చెందిన వ్యవసాయ నేపథ్యం కలిగినది. అక్కడ వరి, కొబ్బరి, వక్క వంటి పంటలను పండించేవారు. ఇందు తండ్రి తన కుటుంబంలోని ఎనిమిది మంది పిల్లలలో మొదటివారు. ఆయన ఆర్మీలో చేరి ముంబైకి వచ్చారు. ఇందు తల్లిదండ్రులు ఆ కాలంలోనే  ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ విద్యావంతులు. తండ్రికి ఉద్యోగరీత్యా లక్నో వంటి ప్రాంతాలకు బదిలీలు ఉండడంతో, ఇందు చిన్ననాటి కుటుంబ ప్రయాణాలు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో కొనసాగాయి. పిల్లల చదువులకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో కుటుంబం ముంబైలో స్థిరపడింది, ఆమె విద్య అంతా అక్కడే జరిగింది. ప్రతి సంవత్సరం కేరళలోని తమ స్వగ్రామాన్ని సందర్శించేవారు, ఆమె నానమ్మ 102 సంవత్సరాలు జీవించారు. ఇందు ఆనంద్ పదికి పైగా భాషలు మాట్లాడగరు. మలయాళం ఆమె మాతృభాష. అయితే హిందీ, ఇంగ్లీష్‌లలో ఆమె తల్లి ఎక్కువ మాట్లాడేవారు. ముంబైలో విద్య, లక్నోలో హిందీ మీడియం చదువు ఆమెకు హిందీపై బలమైన పట్టును ఇచ్చాయి. బెంగళూరులో ఉన్నప్పుడు పనివాళ్లతో సంభాషణ ద్వారా కన్నడ నేర్చుకున్నారు. తెలుగును ఆమె సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. ఆమె స్వస్థలం పాలక్కాడ్.. పూర్వం తమిళనాడులో భాగంగా ఉండేది, కోయంబత్తూర్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనివల్ల తమిళ ప్రభావం ఉండటంతో ఆమెకు తమిళం కూడా వచ్చు. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతీ (స్నేహితుల ద్వారా), బెంగాలీ (భర్త స్నేహితుల ద్వారా), పంజాబీ (ప్రస్తుతం ఉన్న స్నేహితుల ద్వారా) వంటి భాషలను కూడా ఆమె నేర్చుకున్నారు.

ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో తనకున్న కుటుంబ సంబంధాన్ని ఇందు ఆనంద్ స్పష్టం చేశారు. సుమ కనకాల…. తన తండ్రి, తల్లి ఇరువైపులా బంధువని ఆమె వివరించారు. సుమ తల్లితో తనకు అనుబంధం ఉందని వివరించారు. రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి మరణించినప్పుడు సుమకు ఫోన్ చేశానని, అలాగే సుమకు తెలియకుండా ఆమె “స్టార్ మహిళా” కార్యక్రమానికి సర్ప్రైజ్ అతిథిగా వెళ్ళానని ఆమె తెలిపారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా తమ మధ్య తరచుగా సంభాషణలు ఉండవని ఆమె అంగీకరించారు.

ఇందు ఆనంద్ సినీ పరిశ్రమలోకి తన భర్త ఆసక్తితోనే ప్రవేశించారు. అప్పటికే ఎనిమిది జాతీయ అవార్డులు పొందిన ప్రముఖ కన్నడ దర్శకుడు నాగభరణ దర్శకత్వంలో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తనకు నటనా అనుభవం లేదని, అంతకుముందు రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేశానని ఆమె తెలిపారు. తన చైల్డిష్ స్వభావాన్ని ఒక ఆశీర్వాదంగా ఆమె పేర్కొన్నారు, ఇది జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని, తన భర్త మరణానంతరం తన కూతురు, పనివాళ్లతో జీవితాన్ని సాఫీగా నెట్టుకురావడానికి దేవుని దయ వల్లే సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read: నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు టాప్ యాక్టర్..