Reading Time: < 1 minute

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణం

Caption of Image.

న్యూఢిల్లీ: బిహార్​సీఎం, జేడీయూ చీఫ్​నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన చాంబర్‌‌లో నితీశ్​కుమార్‌‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ చీఫ్​ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘవాల్‌‌, బిహార్ డిప్యూటీ సీఎంలు విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్​మాట్లాడుతూ.. బిహార్‌‌లో తాను చేయాల్సిన పనులన్నీ దాదాపు పూర్తి చేశానని, ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలనుకుంటున్నట్టు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.