Reading Time: 2 minutes

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 భాగంగా ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న కీలక పోరులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసేందుకు  సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోతుంది. ఇక ఈ మ్యాచులో గెలిచి తిరిగి ఫామ్ లోకి రావాలనే పట్టుదలతో ఆరెంజ్ ఆర్మీ ఉండగా.. హైదరాబాద్ ని ఓడించి విజయ పరంపరాని కొనసాగించాలని పంజాబ్ కింగ్స్ చూస్తుంది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ తీసుకున్నాం.. ఇది పగటిపూట జరిగే మ్యాచ్, కాబట్టి వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి.. గత రెండు మ్యాచ్‌లలో మేము మంచి టీమ్ వర్క్ తో ముందుకు నడవటంతోనే విజయాలు సాధించాం.. జట్టులోని యువ ఆటగాళ్లందరికీ అండగా ఉండాలి.. వారు వారి సహజ స్వభావంతో ఆడటం బెటర్ అని పేర్కొన్నారు. 

Also Read : PBKS vs SRH మధ్య హై వోల్టేజ్ పోరు

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ తీసుకుందామని అనుకున్నాం.. కానీ మొదట బ్యాటింగ్ చేస్తున్నాం, కాబట్టి భారీ స్కోర్ చేసి పంజాబ్ పై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం.. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింజ్ తుది జట్టులోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు.  

పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ
ఇంపాక్ట్ ప్లేయర్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్. 

 

 

©️ VIL Media Pvt Ltd.