
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ నటి జయప్రద కుమారుడు సామ్రాట్ చేరుతున్నారు. గత కొంతకాలంగా సామ్రాట్ హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సామ్రాట్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తీసుకుంది. భారీ బడ్జెట్‌తో, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే సామ్రాట్ నటనలో, ఫైట్స్, డాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
Also Read: The Paradise: ‘ద ప్యారడైజ్’ నుండి ‘సుబ్బు’ వచ్చేసింది.. నాని హీరోయిన్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ఈ భారీ లాంచింగ్ మూవీ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ (Top Heroine) కోసం చూస్తోంది. సామ్రాట్ సరసన నటించేందుకు టాలీవుడ్‌లోని ఒక టాప్ హీరోయిన్ అయితేనే సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని జయప్రద భావిస్తున్నారట. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లతో చర్చలు కూడా జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. తన కుమారుడి డెబ్యూ కోసం జయప్రద స్వయంగా కథా చర్చల్లో పాల్గొనడమే కాకుండా, టెక్నికల్ టీం విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. దీంతో సామ్రాట్ తన తల్లికి తగ్గట్టుగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలని సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.