Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Jitesh Sharma Funny Bat Video Ipl 2026

Vaibhav Sooryavanshi: శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. వరుసు బౌండరీలతో బౌలర్లకు చెమటలు పట్టించాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెన్సేషన్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మతో సరదాగా గడిపాడు. ఈ తరుణంలో జితేష్ వైభవ్ బ్యాట్ తీసుకుని చెక్ చేయడం ఆసక్తికరంగా మారింది. జితేష్, వైభవ్ బ్యాట్‌ను ఆటపట్టించడంతో వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

వీడియోలో ఏముందంటే..?
ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ సరదాగా వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్లాడు. బ్యాట్ ఇవ్వమని అడిగాడు. దాన్ని పట్టుకుని చూశాడు. ఇక ఆ బ్యాట్ తీసుకుని థ్యాంక్యూ అని చెబుతూ అక్కడి నుంచి వెళ్లబోయాడు. వెంటనే ఈ కుర్రాడు “ఓ భాయ్.. నా బ్యాట్ నాకు ఇవ్వు. దీని గురించి తర్వాత మాట్లాడదాం” అని తన బ్యాట్‌ను తీసుకున్నాడు వైభవ్. అంతేకాదు.. “మీ టీమ్‌లో చాలా మంది స్టార్ బ్యాటర్లు ఉన్నారు. వారిని అడగకుండా నా బ్యాట్ ఎందుకు అడుగుతున్నారు?” అని ప్రశ్నించాడు. సరదాగా స్పందించిన జితేష్ తాను ఎవరినీ బ్యాట్ అడగలేదని, కేవలం వైభవ్ బ్యాట్ మాత్రమే కావాలని కోరాడు. ఐపీఎల్ ముగిశాక బ్యాట్ ఇచ్చేస్తానని సూర్య వంశీ చెప్పాడు. “నేను మీకు ముందే చెప్పా. ఐపీఎల్ అయిపోయిన వెంటనే నా బ్యాట్ మీకు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కావాలని పట్టుబట్టడం ఏంటి?” అని వైభవ్ అన్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.