
మన తెలంగాణ/హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల మనుగడకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రజా ఉద్య మం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రజా సమ స్య అని ఆయన తెలిపారు. ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం అంతరం తీసుకుని రావాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం సిడబ్లుసి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ ని యోజకవర్గాల పునర్విభజనతో పెద్ద రా ష్ట్రాలు మరింత పెద్దవిగా, చిన్న రాష్ట్రాలు చిన్నవిగా మిగిలిపోతాయని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ని యోజకవర్గాల పునర్విభజన అవసరం ఏ మి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవ లం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం శాస్త్రీయం కాదన్నారు. ఇది దేశ సమగ్రతకు, సమాఖ్య స్పూర్తికి విఘాతం అని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సంపూర్ణ మద్దతు ప్రకటించింద ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల అంశం తొలుత తమ పార్టీ ప్రతిపాదనేనని చెప్పారు. ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ ప్రతిపాదించారని ఆయన తెలిపారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని సిడబ్లుసి తీర్మానం చేసిందని ఆయన వివరించారు. 2023లో బిల్లు తీసుకొచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఇండియా కూటమి పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు. 50 శాతం సీట్లు పెరిగినప్పుడు మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఒబిసి కోటా కూడా ఇవ్వాలని ఈ సమావేశంలో ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ అన్నారని ఆయన చెప్పారు. ఒబిసిల రిజర్వేషన్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం 543 లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రకారం 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తే సరిపోతుందన్నారు. దీని కోసం నియోజకవర్గాల పెంపు ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.’
జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనన్న సిఎం
బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చాలా మంది నాయకులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ కోసం కష్టపడిన వారిని బయటకి పంపించారని, ఆయన దేవేందర్ గౌడ్, ఈటల రాజేందర్, ఆలే నరేంద్ర, విజయశాంతి, జూపలి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లను ఉదహరించారు. జూపల్లి కృష్ణారావు ఓడిపోతే హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని కనీసం వార్డు సభ్యునిగా కూడా నియమించలేదని ఆయన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల ్లచట్టాలను ఉపసంహరించుకున్నట్లే, డీ-లిమిటేషన్ బిల్లును కూడా ఉపసంహరించుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
జర్నలిస్టులకు 45రోజుల్లో ఇళ్ళ స్థలాలకు మార్గం
ఇదిలాఉండగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయే నలభై ఐదు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొంటామని హామీ ఇచ్చారు.