
చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ బాబీతో ఉంటుందని తెలుసు.. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది..? ఫ్యామిలీ రూట్‌లోనే వెళ్తున్నారా లేదంటే బాబీ కోసం స్కూల్ మార్చేస్తున్నారా..? ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన బాబీ.. ఈసారి చిరుతో ఏం చేయబోతున్నారు..? అసలు ఈ సినిమా ఓపెనింగ్ ఎప్పుడు..? చూద్దాం పదండి మెగా 158 అప్‌డేట్స్.. చిరంజీవి, బాబీ సినిమాపై మేజర్ అప్‌డేట్ వచ్చింది.. ఏప్రిల్ 11న మెగా 158 ఓపెనింగ్ జరగబోతుంది. స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా బాబీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా.. ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నారు చిరంజీవి. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పవర్‌ఫుల్ మాఫియా కథతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ చాలా కీలకంగా ఉండబోతోందని.. ఆ పాత్ర కోసం అనస్వర రాజన్, ప్రీతి ముకుందన్ లాంటి ఒకరిద్దరు యంగ్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. గతంలో చూడాలని ఉంది కూడా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లోనే రికార్డులు తిరగరాసింది. ఏప్రిల్ 11న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. త్వరగానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. దీనికోసం బరువు తగ్గి మరింత మేకోవర్ అవుతున్నారు మెగాస్టార్. బాబీ సినిమా 2027లో రిలీజ్ కానుంది. దానికంటే ముందే ఇదే ఏడాది విశ్వంభరతో రానున్నారు చిరు. ఈ సినిమా డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్
టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం
Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్
మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్