Reading Time: < 1 minute

హిమాయత్ సాగర్ ORR దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

Caption of Image.

హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హిమాయత్ సాగర్ ర్ సర్వీస్ రోడ్డు దగ్గర బైక్ అదుపు తప్పడంతో ఇద్దరు యువకులు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు అబ్దుల్ సోహెద్, షైక్ సాహిల్ ఇద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పని చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.
 

©️ VIL Media Pvt Ltd.