
సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ పర్సెంటేజ్ విషయంలో మొదలైన వివాదం.. నిర్మాతల మధ్య చిచ్చు పెడుతుందా..? నైజాం ఏరియాలో వాటా పద్దతి టాలీవుడ్ పెద్దలకు నచ్చట్లేదా..? దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలు ఈ వివాదానికి ఎందుకు దూరంగా సైలెంట్‌గా ఉంటున్నారు..? రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ మలుపు తిప్పబోతోంది..? టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 30 నుంచి నైజాంలోని 23 థియేటర్లు వసూళ్లలో పర్సెంటేజ్ విధానానికే మొగ్గుచూపడంతో రగడ మొదలైంది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఒక్కటై ప్రెస్ నోట్ విడుదల చేయగా.. కీలక పెద్దలైన అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ ఈ విషయంపై మౌనంగా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్ల మనుగడ సాగాలంటే వాటా తప్పనిసరి అనేది ఎగ్జిబిటర్లు వాదన.. నిర్మాతలు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెంట్స్ పోయి పర్సెంటేజ్ వస్తే రాబడికి గండి పడుతుందని వాళ్ల భయం. ఆడితే రెంట్ అని.. ఫ్లాపైతే పర్సంటేజ్ అని ఎగ్జిబిటర్లు డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఫిలిం ఛాంబర్లో అన్నింటిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకి ప్రేక్షకులపై కూడా ప్రభావం చూపించేలా ఉంది. నిర్మాతలకు గిట్టుబాటు కాకపోతే టికెట్ రేట్లు భారీగా పెంచడం లేదంటే డైరెక్ట్‌గా ఓటీటీకి ఇవ్వడం చేస్తారు. ఇదే జరిగితే సింగిల్ స్క్రీన్స్ మనుగడ మరింత కష్టంగా మారడం ఖాయం. ఇది నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిసి నిర్ణయించాల్సిన విషయం. రోజురోజుకూ ముదురుతున్న ఈ వివాదానికి చెక్ పడాలంటే ఏదో ఓ వర్గానికి లాభం చేకూర్చేలా కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన విధానం రావాల్సిందే. అద్దెతో పాటు పర్సంటేజ్ కలిపిన ఒక హైబ్రిడ్ మోడల్‌ను తెరపైకి తెస్తేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ పర్సెంటేజ్ వివాదం మొత్తం టాలీవుడ్ వ్యవస్థనే కుదిపే ప్రమాదం లేకపోలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్
మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు