
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు శ్రేయస్, ప్రియాంష్, ప్రభసిమ్రన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఈజీగా గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ రెండో స్థానంలోనే కొనసాగుతుంది. ఇక బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య ( 20 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సులతో 57 పరుగులు), ప్రభసిమ్రన్ సింగ్ ( 25 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 51 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా ఈ జోడిని శివాంగ్ కుమార్ బ్రేక్ చేశాడు.
అనంతరం 117 పరుగుల వద్ద శివాంగ్ బౌలింగ్ (8.5)లో హెన్రిచ్ క్లాసెన్ కి క్యాచ్ ఇచ్చి ప్రభసిమ్రన్ సింగ్ క్రీజు వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కూపర్ కొన్నోలీ(11)ని కూడా శివాంగ్ అవుట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నెహల్ వధేరా కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ హర్ష్ దూబే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు, వికెట్లు పడుతున్నప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్– శశాంక్ సింగ్ తో కలిసి స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ, మధ్య మధ్యలో మెరుపు బౌండరీలు కొట్టారు.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( 33 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సులతో 69 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని మ్యాచ్ ని ఫినిష్ చేసేశాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ ఒక్కడే 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లని పడగొట్టగా, హార్ష్ దూబే ఒక వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Oozing style and confidence 😎
Captain Shreyas Iyer took @PunjabKingsIPL towards victory with such delightful shots 🙌
Scorecard ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH | @ShreyasIyer15 pic.twitter.com/zDeejeklbm
— IndianPremierLeague (@IPL) April 11, 2026