
అమరావతి: బాలిక గొంతుకోసి పారిపోతున్న ప్రేమోన్మాది పోలీసులు పట్టుకున్నారు. కానీ కాస్టేబుళ్లపై దాడి చేసి పారిపోతుండగా అతడిపై ఎస్‌ఐ కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అగ్రహారం గ్రామంలో శ్రీనివాసులు, నాగమణేమ్మ అనే దంపతులు నివస్తిన్నారు. ఈ దంపతులకు ఇంటర్ చదివే కూతురు ఉంది. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ గత కొంత కాలంగా ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తుండగా ఆమె నిరాకరిస్తోంది. దీంతో ఆమెపై అతడు పగ పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక గొంతు కోసి పారిపోయాడు. బాలిక కేకలు వేయడంతో గ్రామస్థులు బాలికను ఆస్పత్రికి తరలించడానకి ప్రయత్నించారు. మార్గం మధ్యతో తండ్రికి వెంకటేశ్, ప్రవీణ్‌ల పేర్లను చెప్పింది. చెన్నూరు శివారులోకి వెళ్లగానే బాలిక కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంగా కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచి పారిపోతుండగా అతడి కాళ్లపై కాల్పులు జరిపాడు. అతడు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.