Reading Time: < 1 minute

న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో అభిషేక్-హెడ్‌లు కలిసి పంజాబ్ బౌలర్లను వణికించారు. ముఖ్యంగా అభిషేక్ పపర్‌ప్లేలోనే 5 ఫోర్లు 7 సిక్సులతో అర్థ శతకం సాధించాడు. మరోవైపు హెడ్‌ కూడా అభిషేక్‌కి తగిన సహకారం అందించాడు. దీంతో పవర్‌ప్లే లోనే ఎస్‌ఆ‌ర్‌హెచ్ స్కోర్ వంద దాటింది. 8 ఓవర్లలో వీరిద్దరు కలిసి 120 భాగస్వామ్యం జత చేశారు. అయితే శశాంక్ సింగ్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. శశాంక్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి హెడ్(38) ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌ మూడో బంతికి అభిషేక్(74) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(1), క్లాసెన్(1) ఉన్నారు.