
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై.. తమ సొంత మైదానంలో అయినా మ్యాచ్ గెలవాలని ఆశపడుతోంది. మరోవైపు ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నితీశ్, విప్రాజ్‌ల స్థానంలో నబీ, అశుతోష్‌ను జట్టులోకి తీసుకుంది. చెన్నై కూడా రెండు మార్పులు చేసింది. డేవాల్డ్ బ్రెవిస్, గుర్‌జప్‌నీత్ సింగ్ లను జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు:
సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, గుర్‌జప్‌నీత్ సింగ్.
డిసి: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంకా, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, ఔకిబ్ నబీ, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.