Reading Time: < 1 minute
దేవుడా.. అన్నదాతల కష్టాలు చూస్తున్నవా ?? పొలానికి ట్యాంకర్‌ నీళ్లే దిక్కు

జనగామ జిల్లాలోని అన్నదాతలు సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంకుశాపురం గ్రామంలో రైతులు తమ వరి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తీవ్ర నీటి కొరతతో పొలాల్లో వరిపంట అంతా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి, బోర్ వెల్స్ పూర్తిగా ఎండిపోవడంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. వేరే బావుల నుండి నీటిని మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి చాలా దూరంలో ఉండటం వల్ల రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. తమ పెట్టుబడి కూడా దక్కేలా లేదని, తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ

రుణగ్రహీతలకు షాక్..పెరగనున్న EMI భారం ??

క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు