Reading Time: < 1 minute

‘మా దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ స్వీట్ ఆయిల్ ఉంది.. వచ్చి తీసుకెళ్లండి’: ప్రపంచ దేశాలకు ట్రంప్ ఆఫర్!

Caption of Image.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రపంచ దేశాలకు ఒక స్వీట్ ఆఫర్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన చమురు, గ్యాస్ మా దగ్గర ఉందని… కావాల్సిన వారు వచ్చి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు  ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ట్రంప్ ఏమన్నారంటే 
“ప్రపంచంలోనే అతిపెద్దవైన ఖాళీ చమురు ట్యాంకర్లు ఇప్పుడు అమెరికా వైపు వస్తున్నాయి. మా దగ్గర అత్యంత నాణ్యమైన చమురు ఉంది. రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాల కంటే కూడా మా దగ్గరే ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మేము మీ కోసం రెడీగా  ఉన్నాము, త్వరగా వచ్చి తీసుకెళ్లండి” అని ట్రూత్ సోషల్ అకౌంట్ పోస్ట్ చేసారు. 

ట్రంప్ చెప్పినట్లుగా అమెరికాలో చమురు ఉత్పత్తి భారీగా పెరిగింది. గణాంకాల ప్రకారం.. 2026 నాటికి అమెరికా రోజుకు దాదాపు 2 కోట్ల 20 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది. ఇది ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలైన రష్యా, సౌదీ అరేబియా రెండింటినీ కలిపినా వచ్చే దానికంటే ఎక్కువే.

ఇరాన్ వివాదం 
ఇరాన్  సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకోవాలని చూస్తుంటే, ట్రంప్ మాత్రం ఆ పరిస్థితిని అమెరికాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇరాన్ అడ్డుపడినా ప్రపంచానికి చమురు సరఫరా ఆగదని ఆయన హెచ్చరిస్తున్నారు.

తను ఒక మంచి ‘బిజినెస్‌మెన్’ అని చెప్పుకునే ట్రంప్, గొడవలు జరుగుతున్న సమయంలో అమెరికా చమురును ప్రపంచానికి అమ్మి భారీగా లాభాలు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు. ముడి చమురు విషయంలో అమెరికాదే పైచేయి అని నిరూపించేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.