Reading Time: < 1 minute

న్యూ చంఢీగడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహరాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు మూడు మ్యాచుల్లో రెండు మ్యాచులు విజయం, ఒక మ్యాచ్ ఫలితం తేలక పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. సన్‌రైజర్స్ రెండు మార్పులు చేసింది. లివింగ్‌స్టోన్ స్థానంలో సాలిల్ అరోరా జట్టులోకి రాగా.. ప్రఫుల్ హింగే ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.

తుది జట్లు:

ఎస్‌ఆర్‌హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సాలిల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, హర్షల్ పాటిల్, ఇషాన్ మలింగ.

పిబికెఎస్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(కీపర్), కూపర్ కన్నోల్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినస్, మార్కో యాన్సన్, జేవర్ బ్రాట్‌లెట్, విజయ్‌కుమార్ వైశ్యక్, అర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.