Reading Time: < 1 minute
Us Iran War Tensions Ceasefire Risk China Role

US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, పాకిస్తాన్ కేంద్రంగా శాంతిచర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మళ్లీ ఏ క్షణానైనా మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే, అమెరికాకు కీలక డిమాండ్లతో ఇరాన్ అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేరితేనే చర్చలు జరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు, యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి.

Read Also: PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

ఇదిలా ఉంటే, కొన్ని రోజుల్లో ఇరాన్ చైనా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుకునే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. నెల రోజులుగా జరుగున్న ఈ యుద్ధంలో చాలా వరకు చైనా సైలెంట్‌గానే ఉంది. కానీ, చైనా అమెరికా కలదలికకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్, శాటిలైట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇరాన్‌కు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతోనే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఆస్తులపై దాడులు చేసిందనే వాదనలు ఉన్నాయి. తాము యుద్ధంలో ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదని, ఎలాంటి సాయం చేయలేదని చైనా ఈ వాదనల్ని ఖండించింది. ఇరాన్‌కు ప్రధానంగా రష్యా, చైనాలు మంచి మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇరాన్‌కు ఈ రెండు దేశాలు పరోక్షంగా సహకరించినట్లు తెలుస్తోంది.

తాజాగా, భుజంపై నుంచి ప్రయోగించి యాంటీ- ఎయిర్ మిస్సైళ్లను ఇరాన్‌కు పంపే అవకాశం ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ గణనీయంగా తన వాయు రక్షణ వ్యవస్థల్ని కోల్పోయింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను టార్గెట్ చేసుకునేందుకు ఈ మ్యాన్ ప్యాడ్‌లను ఉపయోగించనుంది. అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేయడానికి ఇరాన్ ఈ మ్యాన్-పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాలంలో శత్రువుల కాల్పుల వల్ల అమెరికా ఫైటర్ జెట్‌లు కూల్చివేయబడటం ఇదే మొదటిసారి.