
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మాస్ మీడియా ఆఫీసర్గా పని చేస్తున్న మిఠాయి ప్రసాద్ రవికుమార్ డాక్టరేట్ సాధించారు. తాగునీటి వసతులు, పరిశుభ్రత, తాగే నీరు కలుషితమైనప్పుడు ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలపై ఆయన అధ్యయనం చేసి కుప్పం ధ్రువీడియన్ యూనివర్సిటీకి సమర్పించాడని డీఎంహెచ్వో వసంత్ కుమార్ తెలిపారు. ఆయనను డీఎంహెచ్ వో, ఏవో శ్రీవాణి, ప్రోగ్రాం ఆఫీసర్లు శశాంక్, నాగ నిర్మాల, ప్రవీణ్ కుమార్, ఆఫీసు సిబ్బంది అభినందించారు.