
హైదరాబాద్: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో వీరవిహారం చేస్తున్నాడు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. ఆర్‌ఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ఆర్‌సిబి తొలుత బ్యాటింగ్ చేసి ఆర్‌ఆర్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్‌ఆర్ బ్యాట్స్‌మెన్లలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 78 పరుగులు, ధృవ్ జురెల్ 43 బంతుల్లో 81 పరుగులు చేయడంతో 18 ఓవర్లకే 202 పరుగులు చేసి విజయం సాధించారు. నాలుగు మ్యాచ్‌లలో 200 పరుగులు చేయడంతో ఆరెంజ్ క్యాప్ దక్కింది. వైభవ్ మాత్రం ఏడు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లతో 78 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా వైభవ్ మీడియాతో మాట్లాడారు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్ వైపు కన్నెత్తి చూడా చూడనని, కేవలం బంతిపై దృష్టి పెట్టి బ్యాటింగ్ చేస్తానని వివరణ ఇచ్చాడు.
ప్రాక్టీస్‌లో ఏవిధంగా బ్యాటింగ్ చేస్తో అదే విధంగానే మైదానంలో ఆడుతానని తెలిపారు. అంతర్జాతీయ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హాజిల్ వుడ్ లాంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఎదుర్కొవడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అనేది చూడాని బంతిని బట్టి సిక్స్‌లో మలుస్తానని చెప్పుకొచ్చాడు. కేక్ కటింగ్ లాంటివి ఏమీ లేవని, తెల్లవారుజామునే విమానం ఎక్కాలని, తనకు భయం లేదని అనుకోవద్దన్నారు. తనని గైడ్ చేసిన వాళ్లలో తన తండ్రితో పనాటు కోచ్‌లు ఉన్నారని,చ ముఖ్యంగా రోమీ సామీ నా గార్డియన్ అని తెలియజేశారు. ఇద్దరు తన ప్రయాణ ప్రారంభం నుంచి ఉన్నారని, ఈ ప్రయాణంలో చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని, ఆటపై మాత్రం దృష్టి పెట్టాలని, ఇతర ఆలోచనలు వదిలేయాలని మోటివేట్ చేస్తారని చెప్పారు. తాము తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే ఇంకో 20 పరుగులు చేసేవాళ్లమని తెలిపారు.