Reading Time: < 1 minute

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాల నడుమ మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది.

అయితే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన అభిమానులకు ఇది శుభవార్త. సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఒటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ ఏప్రిల్ 16వ తేదీ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒటిటిలో హిట్ టాక్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి అంటే.. ఏప్రిల్ 16 వరకూ ఆగాల్సిందే.