Reading Time: < 1 minute
Abhishek Sharma Creates History Most Fastest Fifties Under 20 Balls In Ipl

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ఓపెనర్‌, కాటేరమ్మ కొడుకు అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో 20 లోపు బంతుల్లో అత్యధికసార్లు హాఫ్‌ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026 భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌ చేస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇది అభిషేక్‌కు ఐదవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్‌ మరే బ్యాటర్ కూడా 20 లోపు బంతుల్లో ఇన్ని హాఫ్ సెంచరీలు బాధలేదు.

అభిషేక్‌ శర్మ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2024లో ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదాడు. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు అర్ధ శతకాలు చేశాడు. 2025లో లక్నోపై 18 బంతుల్లో, 2024లో మరోసారి లక్నోపై 19 బంతుల్లో, 2024లో పంజాబ్‌పై 19 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో విండీస్ వీరుడు నికోలస్‌ పూరన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో నాలుగు సార్లు 20 కంటే తక్కువ బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించాడు. జేక్‌ ఫ్రేజర్‌, ట్రావిస్‌ హెడ్‌, వైభవ్‌ సూర్యవంశీలు తలో మూడుసార్లు 20 కంటే తక్కువ బంతుల్లోపే హాఫ్ సెంచరీ చేశారు.

అభిషేక్‌ శర్మ హాఫ్ సెంచరీలు:
# 2026 vs పంజాబ్‌ (18 బంతుల్లో)
# 2025 vs లక్నో (18 బంతుల్లో)
# 2024 vs ముంబై (16 బంతుల్లో)
# 2024 vs లక్నో (19 బంతుల్లో)
# 2024 vs పంజాబ్‌ (19 బంతుల్లో)