Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Fastest Fifty Rr Vs Rcb Ipl 2026

Vaibhav Sooryavanshi: నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఫోర్‌తో తన ఖాతాను తెరిచాడు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన ఈ కుర్రాడు, రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ అవుటైనప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. హేజిల్‌వుడ్ వేసిన వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ సీజన్‌లో సూర్యవంశీ ఇలా 15 బంతుల్లోనే అర్ధశతకం బాదడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా బర్సపరా స్టేడియంలో ఇదే ఘనత సాధించాడు.

READ MORE: Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

దీంతో ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో సూర్యవంశీ తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్ (14 బంతులు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా, యూసుఫ్ పఠాన్ (15 బంతులు) రికార్డును సూర్యవంశీ రెండుసార్లు సమం చేశాడు. అంతేకాకుండా, రాజస్థాన్ రాయల్స్ తరఫున పవర్ ప్లే (తొలి 6 ఓవర్లలో) లోనే హాఫ్ సెంచరీ బాదిన జోస్ బట్లర్ రికార్డును కూడా ఈ యువ ఆటగాడు అందుకున్నాడు. రాజస్థాన్ జట్టులో ఈ ఘనతను జైస్వాల్ రెండుసార్లు సాధించగా.. మైఖేల్ లంబ్, బెన్ స్టోక్స్, నితీష్ రాణా ఒక్కోసారి చొప్పున సాధించారు.

READ MORE: Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 201 పరుగుల భారీ స్కోరును అందించాడు. విరాట్ కోహ్లీ (32), రోమారియో షెపర్డ్ (22), వెంకటేష్ అయ్యర్ (29) కూడా తమ వంతు సహకారం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

READ MORE: Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?

ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ (భారత బ్యాట్స్‌మన్)
13 బంతుల్లో- యశస్వి జైస్వాల్ ( రాజస్థాన్ రాయల్స్ ) vs KKR, కోల్‌కతా, 2023
14 బంతుల్లో- KL రాహుల్ (పంజాబ్ కింగ్స్) vs ఢిల్లీ క్యాపిటల్స్, మొహాలీ, 2018,
15 బంతుల్లో సన్‌కేఆర్, హైదరాబాద్, సన్‌కేఆర్ పఠాన్
15 బంతులు- వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs చెన్నై సూపర్ కింగ్స్, గౌహతి, 2026
15 బంతులు- వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) vs RCB, గౌహతి, 2026