Reading Time: 2 minutes

వాట్సాప్ మీ డేటాను అమ్ముకుంటోంది.. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్: టెలిగ్రామ్ సీఈఓ ఆరోపణలు

Caption of Image.

వాట్సాప్, టెలిగ్రామ్ గురించి తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రపంచలోనే అతిపెద్ద మెసెంజర్ సర్వీసెస్ అందించే సంస్థలివి. అయితే రెండు మెసెంజర్స్ కంపెనీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అని తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులను మోసం చేస్తోందని టెలిగ్రామ్ సీఈఓ ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది.

వాట్సాప్ పాల్పడుతున్నది ప్రపంచంలోని అతిపెద్ద కన్స్యూమర్ ఫ్రాడ్ అని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాట్సాప్ తన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ గురించి చేసే క్లెయిమ్స్.. చరిత్రలోనే అతిపెద్ద మోసం అని డురోవ్ అన్నారు. వాట్సాప్ బిలియన్ల మంది యూజర్లను మోసం చేస్తోంది. తను చెప్పినట్టు ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ, యూజర్ల మెసేజెస్‌ను చదువుతోందని ఆరోపించారు.  చదవటమే కాకుండా వాటిని థర్డ్ పార్టీలతో షేర్ చేస్తుందని ఆరోపించడంతో రెండు పెట్ట టెక్ జెయింట్స్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. 

వాట్సాప్ పైన ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికాలో వాట్సాప్‌పై దాఖలైన క్లాస్ యాక్షన్ లాసూట్‌లో కూడా ఇలాంటి ఆరోపణలు ఉండటం గమనార్హం. వాట్సాప్ ప్రజలను ఘోరంగా మోసం చేస్తోంది. కానీ  టెలిగ్రామ్ ఎప్పుడూ ఇలా చేయలేదు.. భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఇలాంటి దిగజారుడు పనులు చేయదు! అంటూ చెప్పుకొచ్చారు టెలిగ్రామ్ సీఈవో డురోవ్.

లాసూట్ లో ఏముంది..?

డ్యూరోవ్ వ్యాఖ్యలతో, ఇటీవల వాట్సాప్ పై నమోదైన లాసూట్ గురించిన చర్చ జరుగుతోంది. ఈ ఫిర్యాదు ప్రకారం, వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు వాట్సాప్‌లో ఒక బ్యాక్‌డోర్ యంత్రాంగం ఉంది. దీని ద్వారా ఉద్యోగులు, యాక్సెంచర్ వంటి సంస్థలతో సహా బయటి కాంట్రాక్టర్లు ఎన్‌క్రిప్షన్ ప్రైవసీని దాటి ప్రైవేట్ మెసేజ్ లను యాక్సెస్ చేయగలరని ఆరోపించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ తనను తాను సురక్షితమైనదిగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఇది వినియోగదారుల సంభాషణలను చదివి దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది అని లాసూట్ లో ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. 

►ALSO READ | రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వచ్చేసింది.. రేటు ఎంతో తెలుసా..?

ఈ వివాదం ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. డ్యూరోవ్ పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్ల నుంచి  తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు టెలిగ్రామ్ ను కూడా ప్రశ్నించారు. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లు డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేయలేదని,  టెలిగ్రామ్ ఉపయోగం, పారదర్శకతపై సందేహాలు ఉన్నట్లు ప్రశిస్తున్నారు. 

. బిలియన్ల కొద్దీ వినియోగదారులు ఉన్న ఏ ఉచిత ప్లాట్‌ఫారమ్ కూడా, డేటాను ఏదో ఒక రూపంలో క్యాష్ చేసుకోకుండా ఉండవంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  మెసేజింగ్ యాప్‌లు ఇచ్చే ప్రైవసీ హామీలు అబద్ధమని, వినియోగదారుల డేటా అడ్వర్టైజింగ్ కంపెనీలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.