Reading Time: < 1 minute

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కి విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా.. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.