Reading Time: < 1 minute

హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీ-ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర గిరిజన వర్సిటీని ముందు మహబూబ్‌నగర్‌లో పెట్టాలనుకున్నామని.. కానీ కేంద్రం ములుగులోనే గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ఏడాది ప్రధాని మోడీ గిరిజన వర్సిటీకి భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. రెండు కేంద్ర సంస్థలు గిరిజన వర్సిటీకి సహకారం అందిస్తాయని అన్నారు. సమ్మక్క-సారలమ్మ యూనివర్సిటీ భవిష్యత్‌లో గొప్ప అభివృద్ధి సాధిస్తుందని.. గిరిజనులకు కావాల్సిన ఆధునిక సాంకేతికతను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అబిడ్స్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్రం రూ.24 వేల కోట్లతో అభివృద్ధి చేస్తుందని అన్నారు.