
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆశించిన మేర ప్రారంభం లభించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0)ని ఇన్సింగ్స ఫస్ట్ బాల్ కే జోఫ్రా అర్చర్ సంధించిన అద్భుతమైన బంతిని ఆడబోయి, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరున్నాడు. దీంతో పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే మొదటి వికెట్ ని నష్టపోయింది.
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన దేవదత్ పడిక్కల్ మరో ఓపెనర్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్సింగ్స్ నిర్మించే క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద షిమ్రాన్ హెట్మెయర్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో కోహ్లీ పడిక్కల్ (14) మధ్య నెలకొన్న 45 పరుగుల భాగస్వామ్యం బ్రేక్ అయింది. ఆ తర్వాత కాసేపటికే స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ కూడా క్రీజు వదిలి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన కిరాక్ బాల్ కి విరాట్ (32) అవుట్ అయ్యాడు.
ఇక ఆర్సీబీ కృనాల్ పాండ్యాకు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ లో ముందుకు పంపించింది. దీంతో అతడు క్రీజులోకి వచ్చి కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్ లో షిమ్రాన్ హెట్మెయర్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన జితేష్ శర్మ సైతం దారుణంగా విఫలమయ్యాడు. జస్ట్ 6 రన్స్ చేసి బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన టీమ్ డేవిడ్ కూడా ఈసారి నిరాశపరిచాడు, కేవలం 13 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో హెట్మెయర్ కి ఇచ్చి మైదానం వదిలి వెళ్లాడు. దీంతో కేవలం 94 పరుగులకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలకమైన 6 వికెట్లని నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో రజత్ పాటిదార్ ( 19), రోమారియో షెపర్డ్ (6) ఉన్నారు.