Reading Time: < 1 minute

ఇస్లామాబాద్: యుద్ధం విషయంలో ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో కొనసాగుతన్నాయి. ఇరాన్ బృందం మినాబ్ 168 పేరు గల విమానంతో పాక్‌లో ల్యాండ్ అయ్యింది. రక్తపుటేరులతో కూడిన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తీసుకొని రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విమానంలో ప్రయాణికు వీరే అని మినాబ్ 168 అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ట్వీట్ చేశారు. బాలికల సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మినాబ్ చిన్నారులను తాము ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అభివర్ణించిన విషయం విధితమే. ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరుపుతున్న చర్చలు సఫలం కావాలని ఆశిస్తున్నామని తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా బాంబులు వేసింది. తొలి రోజులు స్కూల్‌పై అమెరికా బాంబులతో విరుచుకపడడంతో 160 మంది చిన్నారులు చనిపోయారు. 

ఇస్లామాబాద్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది సైనిక సిబ్బందితో పహారా కాస్తున్నారు.  శాంతి చర్చల సందర్భంగా ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లామాబాద్‌ చేరుకున్న అమెరికా జేడీ వాన్స్‌ బృందానికి పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిఫ్‌ మునీర్‌ స్వాగతం పలికారు. మధ్యాహ్నం తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభంకానున్నాయి. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చలు జరిపిన తరువాత వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్‌ మధ్యవర్తుల చర్చలు జరుపుతారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు జరుపుతారు.