మన దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు మరణానంతరం కూడా యాక్టివ్‌గా ఉండటం అనేక ఆర్థిక, న్యాయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్‌గా ఉంటే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు, సబ్సిడీలు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాలలో మోసాలకు ఇది దారితీయవచ్చు. అలాగే గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్) కేసులు పెరిగే అవకాశం ఉంది.
అందుకే కుటుంబ సభ్యులు ముందస్తుగా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆధార్‌ను డీయాక్టివేట్ చేయించడం వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ఒకటి మోసపూరిత లావాదేవీలను అరికట్టడం. రెండవది, ప్రభుత్వ రికార్డుల్లో సరైన సమాచారం నమోదు కావడం.
దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడానికి myaadhaar.uidai.gov.in వెబ్సైట్లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.
రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి. డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మృతి చెందిన వ్యక్తి ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది.




