Reading Time: < 1 minute
Singer Mangli Complaint Against Lawyer Subha Singabose Case

ప్రముఖ సింగర్ గాయని మంగ్లీ తనపై సామాజిక మాధ్యమాల్లో, బహిరంగంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. న్యాయవాది సుభా సింగబోష్‌ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సుమారు 150 కోట్ల రూపాయల మోసం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల మార్చి 21వ తేదీన సుభా సియపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి, అత్యంత అమర్యాదగా, బెదిరించే ధోరణిలో మాట్లాడారని మంగ్లీ పోలీసులకు వివరించారు. తనను నేరుగా కలవాలని ఆయన ఒత్తిడి చేశారని, ఒకవేళ కలవడానికి నిరాకరిస్తే సమాజంలో అప్రతిష్ట పాలు చేస్తానని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Mojtaba Khamenei: ఇరాన్‌కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..

మంగ్లీని భయపెట్టే క్రమంలో నిందితుడు ఆమెకు ఏమాత్రం సంబంధం లేని భారీ కరెన్సీ నోట్ల కట్టలు ఉన్న ఒక వీడియోను చూపించి బెదిరించినట్లు సమాచారం. మరో వ్యక్తితో కలిసి తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వరుస పరిణామాల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తన వృత్తిపరమైన జీవితంపై కూడా ఇది ప్రభావం చూపుతోందని ఆమె పోలీసులకు తెలిపారు. మంగ్లీ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న నార్సింగి పోలీసులు, సుభా సింగబోష్‌పై BNS సెక్షన్లు 79 , 351(3) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా, పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారు.

 Sunrisers Hyderabad History: సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన మైలురాయి.. ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ!