
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. జురేల్ 81, జడేజా 24 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.