
Marco Jansen Stunning One-Hand Catch: నేడు ముల్లాన్ పూర్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అద్భుత ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన వన్-హ్యాండ్ క్యాచ్ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన SRH దూకుడిగా ఆడింది.
Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!
ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ దిశగా నడిపించారు. 14 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ 169/2 స్కోర్‌తో బలంగా కనిపించింది. ఈ సమయంలో పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ వేసిన బంతిని ఇషాన్ కిషన్ బౌండరీ దిశగా లాఫ్ట్ షాట్ ఆడాడు. బంతి సిక్స్ అవుతుందని అందరూ భావించినప్పటికీ, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్కో జాన్సెన్ అద్భుతంగా ఒక్క చేతితో క్యాచ్ పట్టి అందరినీ షాక్‌కు గురిచేశాడు. దీనితో ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 27 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు. ఈ క్యాచ్ తో ఇషాన్ కిషన్ షాక్ గురయ్యాడు. ఆ ఘటనతో మిగతా బ్యాటర్లు చక్కగా ఆడడంతో జట్టు 20 ఓవర్లలో 219/6 అనే భారీ స్కోర్ నమోదు చేసింది.
SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
What a catch by Marco Jansen
He made that catch look easy
Marco Jansen with a bit of magic in the deep
#IPL2026 #PBKSvsSRH
pic.twitter.com/U1estB5Q67— Hitman (@Vijay456V60026) April 11, 2026


Marco Jansen with a bit of magic in the deep 
