Reading Time: < 1 minute
Singer Mangli Cheating Case 10 Crores Fraud Complaint Updates

టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ (సత్యవతి చౌహాన్) చిక్కుల్లో పడ్డారు.. తన పాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కోవడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తనను రూ. 10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆర్థిక మోసమే కాకుండా, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. బాధితుడు అందించిన ఆధారాల మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు..

Also Read: Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కొత్త చట్టం ప్రకారం బీఎన్‌ఎస్‌ (BNS) సెక్షన్ 351 (2), 352 కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలోనూ మంగ్లీ కొన్ని వివాదాల్లో నిలిచినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో ఆర్థిక మోసం, బెదిరింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె కెరీర్‌పై ఈ కేసు ప్రభావం ఎంతవరకు ఉంటుందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

తీన్మార్ వార్తల ద్వారా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ, తెలంగాణ జానపద పాటలతో అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ‘రాములో రాములా’, ‘సారంగదరియా’, ‘జింతాక్’, ‘జ్వాలారెడ్డి’ వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఏపీలో పుట్టినప్పటికీ తెలంగాణ యాసపై పట్టుతో బతుకమ్మ, బోనాల పాటలతో జనానికి బాగా దగ్గరయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఆరోపణలపై మంగ్లీ టీం నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.