
CSK vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి టోర్నీలో ఖాతా ఓపెన్ చేయాలని ఎల్లో ఆర్మీ చూస్తుండగా.. చెన్నపై విజయం సాధించి గుజరాత్ పై ఒక్క రన్ తేడాతో ఓడిన బాధని దిగమింగుకోవాలని చూస్తుంది. దీంతో ఈ రెండు జట్లకి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఈ సీజన్‌లో చెన్నై ఆటతీరు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సీఎస్‌కే, బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. ఫామ్ కోల్పోయిన సంజూ శాంసన్ ఈ మ్యాచులో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జట్టుకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తుది జట్టులోకి రావడం. అతని రాకతో సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC): అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో కేవలం ఒకే ఒక్క పరుగుతో ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. డేవిడ్ మిల్లర్ గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడినప్పటికీ తృటిలో విజయాన్ని దక్కించులేకపోయారు.
ALSO READ : అభిషేక్–హెడ్ తుఫాన్ బ్యాటింగ్..
పిచ్ రిపోర్ట్:
సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది, కానీ ఇటీవలి కాలంలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా మారిన ఈ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది. ఈ ఫ్లాట్ ట్రాక్‌పై టాస్ గెలిచిన జట్టు భారీ స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది.
ఎవరు గెలుస్తారంటే?
ప్రస్తుత ఫామ్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిచిన ఢిల్లీ, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే వారు మూడో స్థానానికి వెళ్తారు. కానీ డెవాల్డ్ బ్రెవిస్ రాకతో చెన్నై కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.