Reading Time: < 1 minute
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

సాధారణంగా గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా గొడవలు జరుగుంటాయి. ఈ గొడవల సందర్భంగా పరస్పరం దుర్భాషలాడుకోవడం కూడా సహజం. అయితే ఒక్కోసారి పరస్పర వాగ్వాదంలో భాగంగా ఒకరినొకరు తిట్టుకుంటూ నోరు జారడం వల్ల చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారుతాయి. అందుకే మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని బోర్‌సర్‌ గ్రామంలో బూతులపై పూర్తిగా నిషేధం విధించారు. నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని గ్రామపెద్దలు తీర్మానం చేసి ప్రకటించారు. బుర్హాన్‌పూర్‌ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 6 వేల మంది జనాభా ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఎవరినైనా తిట్టారు అంటే ధనిక, పేద తేడా లేకుండా రూ.500 జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే గంటసేపు గ్రామంలో పారిశుధ్య పనులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామమంతా పోస్టర్లు వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ప్రజల మధ్య ఐక్యత చెడుతుందని, గొడవలు పెద్దవి కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేయిస్తున్నామని సర్పంచి అంతర్‌సింగ్‌ తెలిపారు. గ్రామంలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశామని, అలాగే నాలుగు చోట్ల ఉచిత వైఫై సదుపాయం, గ్రామం అంతటా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ

రుణగ్రహీతలకు షాక్..పెరగనున్న EMI భారం ??

క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు