Reading Time: < 1 minute

మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ “మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ని రూపొందించాం.

ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని ఎంతో ఆదరిస్తున్నారు. ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. అందరూ ‘రాకాస’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి” అని అన్నారు. మైత్రి రవి మాట్లాడుతూ “నిహారిక ‘రాకాస’ని అద్భుతంగా ప్రమోట్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం. మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో కూల్ బ్రీత్‌లా ఉండే చిత్రమిది. ఆద్యంతం నవ్వించారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ‘రాకాస’లో పార్ట్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి హ్యాపీగా నవ్వుకుని, ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ ఉంది”అని తెలిపారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “రెండో వారంలోనూ ‘రాకాస’కి మంచి స్క్రీన్లు ఉన్నాయి. అదే మా సినిమా విజయానికి నిదర్శనం. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు వచ్చేది కాదు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానస శర్మ, మన్యం రమేష్, సన్నీ, రమేష్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.