Reading Time: < 1 minute
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు జువెలరీ షాపులో చొరబడి, గన్‌తో బెదిరించి దోపిడీకి యత్నించారు. గన్‌ గురిపెట్టినా బెదరని సిబ్బంది దొంగను తరిమి కొట్టారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం కన్యాజువెలరీ షాపుముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులోనుంచి బురఖా ధరించి ఉన్న ఓ ఐదుగురు వ్యక్తులు దిగారు. వారిలో ఓ వ్యక్తి షాపులోపలికి రాగా మిగతావారు కారులోనే ఉన్నారు. షాపులోపలికి వెళ్లిన వ్యక్తి ఒక్కసారిగా తన వద్ద ఉన్న గన్‌ను బయటకు తీసి యజమానిని, సిబ్బందిని బెదిరించారు. యజమానిపై దాడికి ప్రయత్నిస్తూ, షాపులోని బంగారాన్ని దోచుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. దొంగ చేతిలో గన్ ఉన్నప్పటికీ, షాపులో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఏమాత్రం భయపడలేదు. మరో యువకుడితో కలిసి వారు దుండగులను గట్టిగా ప్రతిఘటించారు. ఊహించని ఈ ఎదురుదాడితో కంగుతిన్న దొంగ, అక్కడ నుంచి బయటకు పరుగులు తీసి కారులో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో నిందితులు ఆంధ్రప్రదేశ్ వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మహిళా సిబ్బంది సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌