
నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా ’ది ప్యారడైజ్’ పై అంచనాలు ’ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత నెక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర పరిచయంతో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ ’ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది.
సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది. ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.