Reading Time: < 1 minute
ఇది కదా మానవత్వం అంటే..కోతికి పునర్జన్మ వీడియో

ఈ వింత సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు జరిగింది. వానరసేనలు గుంపుగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై స్తంభంపై నుండి కిందపడి గిలగిల కొట్టుకుంటోంది. ఇది చూసి అక్కడున్న వారు చలించి పోయారు. పదిహేను నిమిషాలకు పైగా కొట్టుమిట్టాడిన వానరం చివరకు స్పృహతప్పి పడిపోయింది. అక్కడి సీన్ చూస్తే.. ఆ వానరం చనిపోయిందనుకుని అంతా భావించారు. పక్కనే ఉన్న వానరాలు పెద్దఎత్తున అరుస్తున్నాయి..ఈ క్రమంలో ఆ వానరాన్ని గమనించిన అక్కడి మునిసిపల్ డోజర్ డ్రైవర్ హరీశ్ తోపాటు, మరో శానిటేషన్ జవాన్ మల్లికార్జున్ అప్రమత్తమై ఆ మూగజీవిని బ్రతికించేందుకు మానవ ప్రయత్నం చేశారు. సిపిఆర్ చేసి మూగజీవానికి ప్రాణం పోశారు. వానరానికి సిపిఆర్ చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ వానరం బతకడం అసాధ్యమని వదిలేయండని కొందరు అన్ననప్పటికీ.. శానిటేషన్ జవాన్ తోపాటు మునిపల్ డ్రైవర్ వానరంపై జాలితో మానవ ప్రయత్నం చేశారు.