Reading Time: < 1 minute
రీల్స్‌ కోసం పట్టాలపై పడుకున్న.. సాహస యువకుడికి ‘సన్మానం’వీడియో

అతడు భావించినట్లుగా కొద్ది క్షణాల్లోనే వీడియో వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతకు మించి కామెంట్లు, షేర్లు రావడంతో.. అజయ్ రాజ్‌భర్ తెగ సంబుర పడిపోయాడు. చిన్నపాటి సెలబ్రిటీని అయ్యానంటూ మురిసిపోయాడు. అయితే ఈ మురిపెం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఈ వీడియో రైల్వే పోలీసుల కంట పడింది. కథలో ట్విస్ట్ ఏంటంటే రైల్వే పోలీస్ తీవ్రంగా స్పందించడం. రైల్వే చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాణాపాయ స్టంట్లు చేస్తూ ఇతరులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగానే యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పై మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు ఊచలు లెక్కబెడుతున్నాడు. రైలు కింద పడుకున్న ఈ ఘటన రీల్స్ వెర్రి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనం . ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.