
రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఉద్యోగులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులను ఖరారు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తగా మారింది. సాధారణ సెలవుల జాబితాలో భోగి, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే, డాక్టర్ అంబేద్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, మిలాద్ ఉన్ నబీ, కృష్ణాష్టమి, వినాయక చవితి, గాంధీ జయంతి, సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్మస్ వంటి పండుగలు ఉన్నాయి. వీటితో పాటు 26 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించారు. ఈ ఐచ్ఛిక సెలవులలో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
మరిన్ని వీడియోల కోసం :