Reading Time: < 1 minute
థాయిలాండ్‌లో ధోని హల్ చల్.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?

ధోని తన కుటుంబంతో కలిసి థాయిలాండ్‌లోని పుకెట్‌లో నూతన సంవత్సరాన్ని స్వాగతించాడు. ఈ ప్రత్యేక సందర్భంలో అతని భార్య సాక్షి, కుమార్తె జివా కూడా అతనితో కలిసి కనిపించారు. ఈ వేడుకల ఫోటోలను ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2026 ధోనికి చాలా స్పెషల్ కానుంది. ఈ ఏడాది ధోనీ ఐపీఎల్‌లో ఆడటం అతని చివరిసారి కావచ్చు. క్రికెట్ అభిమానులు ధోనిని ఆటలో చూసే చివరి సంవత్సరమూ ఇదే కావచ్చు. ఈ సంవత్సరం, అతను తన రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలకు ముగింపు పలకుతాడనే అంచనాలున్నాయి. గతంలో కూడా ఎంఎస్ ధోనీ థాయిలాండ్‌లో తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.అక్కడ ఫుటెక్‌లోని బీచ్‌లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.