Reading Time: < 1 minute

హైదరాబాద్: పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. మున్సిపాలిటీల్లో అసలు పరిపాలనే లేదని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అవినీతినే కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోటీ చేస్తున్నామని, తెలంగాణలో బిజెపికి ఆదరణ పెరుగుతోందని.. తొలిసారి మొత్తం మున్సిపాలిటీల్లో బరిలోకి దిగుతున్నామని రామచందర్ తెలియజేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకే గూటి పక్షులు.. వాటి విధానాలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వచ్చిన రూ.250 కోట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. గుజరాత్ సిఎంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో సిట్ విచారణకు హాజరయ్యారని, సిట్ విచారణ తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటవుతాయని రామచందర్ రావు పేర్కొన్నారు.