Reading Time: < 1 minute

సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన ‘విచిత్ర’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని అన్నారు. ప్రముఖ దర్శకులు విఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘విచిత్ర సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతుంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ రావ్ ఇలపండ పాల్గొన్నారు.