Reading Time: < 1 minute

హైదరాబాద్: ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరసగా మూడో మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు పరాజయాలపాలైంది. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో సిఎస్‌కె జ్టటు 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి జట్టు 251 పరుగుల లక్ష్యాన్ని సిఎస్‌కె ముందు ఉంచింది. సంజు శామ్సన్‌పై అధిక అంచనాలను పెట్టుకున్నప్పటికి అతడు వమ్ము చేశాడు. హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే భిన్నంగా ఉండేదని వివరించాడు. ఆర్‌సిబి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్ వరకు మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందని, టిమ్ డేవిడ్‌ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేసినప్పటి, అది నో బాల్ కావడంతో అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నారు. లక్ష్య చేదనలో కూడా మూడు వికెట్లు త్వరగా పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో జట్టు పడిందని, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, ఓవర్టన్ మంచి ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు. శివమ్ దూబే దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడని పేర్కొన్నారు. మూడు ఓటములకు తానే బాధ్యత వహిస్తున్నానని రుతురాజ్ స్పష్టం చేశాడు.