Reading Time: 2 minutes
ముత్తాతల నాటి సీక్రెట్.. ఈ ఒక్క అలవాటు మార్చుకున్నారంటే.. మీరు వందేళ్లు బ్రతకడం పక్కా!

ఆరోగ్యాన్ని ప్రసాదించే అనేక అలవాట్లలోకెల్లా, ఆయుష్షును పెంచే అలవాట్లలో కెల్లా అత్యుత్తమమైనది ఈ ముందుగా చేసే రాత్రి భోజనం. సాయంత్రం 4:00, 5:00 లేదా కనీసం 6:00 గంటలలోపు రాత్రి భోజనాన్ని ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటును పాటించడం వల్ల అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. సాయంత్రం ముందుగా భోజనం చేసినప్పుడు, రాత్రి 8 నుంచి 9 గంటల కల్లా ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. దీంతో నిద్రపోయే సమయానికి పొట్ట, ప్రేగులు ఖాళీగా ఉంటాయి. ఈ స్థితిలో శరీరంలో కొన్ని కీలకమైన హార్మోన్లు, ఎంజైమ్‌లు విడుదలవుతాయి.

వాటిలో ప్రధానమైనది ఇన్సులిన్-లైక్ గ్రోత్ ఫ్యాక్టర్-1, ఇది కాలేయం నుండి విడుదలవుతుంది. ఖాళీ పొట్ట ఉన్నప్పుడు IGF-1 విడుదలయ్యి, బోన్ మ్యారోను ఉత్తేజపరుస్తుంది. ఇది కొత్త తెల్ల రక్త కణాల పునర్విభజనను, చనిపోయిన కణాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త కణ నిర్మాణం జరగడానికి సహాయపడుతుంది. తద్వారా రక్షణ వ్యవస్థ బలంగా తయారవుతుంది. అలాగే, రక్షణ వ్యవస్థలో కీలకమైన T-సెల్ ఫ్యాక్టర్ 7 కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పెరుగుతుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది.

ఆటోఫ్యాగీ – కణాల స్వీయ శుభ్రత

ముందుగా భోజనం చేసి, రాత్రి 8 నుంచి 9 గంటలలోపు జీర్ణక్రియను పూర్తి చేసినప్పుడు, ప్రతి కణం లోపల ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ప్రక్రియలు, అంటే ఆటోఫ్యాగీ బటన్ ఆన్ అవుతుంది. ఆటోఫ్యాగీ అంటే కణాలు తమను తాము శుభ్రం చేసుకోవడం, చెడిపోయిన లేదా పాడైపోయిన భాగాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించుకోవడం. మన శరీరం 125 ట్రిలియన్ల కణాల సముదాయం. ఉదయం నిద్ర లేచే సమయానికి, శరీరంలోని ప్రతి కణం పూర్తిగా రిపేర్ అయి, రిఫ్రెష్ అయి ఉంటుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి, తద్వారా ఆయుష్షు సహజంగా పెరుగుతుంది.

చారిత్రక, శాస్త్రీయ ఆధారాలు

ప్రాచీన కాలంలో మన ఋషులు రోజులో ఒకేసారి భోజనం చేయడం ఆచరించి ఎక్కువ కాలం జీవించారు, దీనికి కారణం ఎక్కువ గంటలు పొట్ట ఖాళీగా ఉండటం వల్ల ఆటోఫ్యాగీ సక్రియం కావడమే. 150 సంవత్సరాలు పైగా జీవించిన చరిత్ర ఋషులకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక పరిశోధనలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయని.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్, USA వారు 1982లో నిర్వహించిన ఒక పరిశోధనలో, తక్కువ సార్లు, తక్కువ ఆహారం తిన్న ఎలుకల ఆయుష్షు 50 శాతం పెరిగిందంటున్నారు. ఈ అధ్యయనం ఎర్లీ డిన్నర్, తక్కువ సార్లు తినడం వల్ల దీర్ఘాయుష్షుకు తోడ్పడుతుందని రుజువు చేస్తుందని చెబుతున్నారు.

ఆచరణలో ఎర్లీ డిన్నర్

ఎర్లీ డిన్నర్ అలవాటు చేసుకున్నప్పుడు, నాలుగు సార్లు తినే అలవాటు తగ్గిపోయి మూడు సార్లు తినడానికి అలవాటు పడతారు. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు రెండు సార్లు భోజనం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఉదయం 9 నుంచి10 గంటలకు, సాయంత్రం 4 నుంచి 5 గంటలకు. ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు లంచ్ బాక్స్‌తో పాటు డిన్నర్ బాగ్ కూడా తీసుకెళ్లి, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటివి సాయంత్రం తినవచ్చుని చెబుతున్నారు. షుగర్ ఉన్నవారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది అనేక పోషకాలను అందిస్తుంది.

ఎర్లీ డిన్నర్ ప్రయోజనాలు

ఆయుష్షు పెరగడమే కాకుండా, ఎర్లీ డిన్నర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. తెల్లవార్లు శరీరంలో రిపేర్, క్లీనింగ్ ప్రక్రియలు జరగడం వల్ల, కాలేయం డిటాక్సిఫై అయ్యి, శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ శుభ్రమైన వాతావరణం అవయవాలు ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది కాలానుగుణ అనారోగ్యాలను, తరచు ఆసుపత్రి పాలవడాన్ని తగ్గిస్తుంది.

(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.