
అమరావతి: క్రికెట్ మ్యాచ్ లో గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో అజిత్(23), కిషోర్(26) అనే ఇద్దరు యువకులు గొడవపడ్డారు. పెద్దగదిలి జంక్షన్ వద్ద కోపంతో రగిలిపోయిన కిశోర్ అందరు చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అజిత్ ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం కిశోర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.