Reading Time: 2 minutes

కొన్ని విషాదభరిత కళారూపాలని మనం చూస్తుప్పుడు అవి మనపై ఒక ముద్ర వేసి, మన నుండి ఏదో బరువు తొలగిపో యి కొంత రిఫ్రెష్ అయినట్టు మనం అనుభూతి పొందుతుంటాం. దాన్ని కెథార్సిస్ అంటారు. నాటక రంగంలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ పదం. ఈ పదాన్ని గ్రీక్ విషాద నాటకం చివరలో ప్రేక్షకులలో కలగజేసే ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగించేవారు. అయితే ఆధునిక ఉపయోగంలో, ‘క్యాథర్టిక్’ అనే ది తీవ్ర భావోద్వేగాల చికిత్సా ఉత్సర్గం అని అర్ధం. సాధారణంగా ఈ పదం బలమైన భావోద్వేగ అనుభవాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది.

కెథార్సిస్ గురించి చర్చించుకోవడం ఎందుకు అవసరం అంటే అది కళకి, సమాజానికి మధ్య, ప్రజల భావోద్వేగాల నిర్వహణకి మధ్య ఒక నైరూప్య సంబంధాన్ని తయారు కావాల్సిన అంశం గురించి చర్చిస్తుంది కాబట్టి. సాధారణంగా,ప్రేక్షకులలో భావోద్వేగ ప్రతిస్పందనను కలిగించి విషాద నాటకం ముస్తుం ది. ప్రేక్షకుల భావోద్వేగాలను వెలికి తీసి, వాటిని వదిలింపజేసి, ఆపై మానసికంగా ప్రశాంతత సాధించి, ప్రక్షాళన చేస్తుంది. ఈ పదాన్ని అరిస్టాటిల్ ట్రాజెడీని గురించి నిర్వచిస్తున్నప్పుడు వాడా డు. విషాద నాటకంలో ట్రాజిక్ చర్య చేసే పని ప్రేక్షకులలో జాలిని, భయాన్ని రేకెత్తించడం. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. పాఠకులు లేదా ప్రేక్షకులు మానసిక, నైతిక శ్రేయస్సు కొరకు, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ప్లేటో చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా అరిస్టాటిల్ కెథార్సిన్‌ని చెప్పాడు అని మనం నమ్మవచ్చు.

పునరుజ్జీవనోద్యమ ఆలోచనాపరులు క్లాసిక్ గ్రీక్ రోమన్ సాహిత్యాలచే ప్రభావం చెందారు. అరిస్టాటిల్ హోరేస్ వంటి వారు వారి కి మార్గ దర్శకులు అయ్యారు. హోరేస్ ప్రకారం కవిత్వం బోధిస్తుం ది, అదే సమయంలో ఆనందపరుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కవి త్వం ఆహ్లాదపరుస్తున్నంది కావున బోధనకి ఉపయోగపడుతుంది. ఉద్వేగ అనుభూతుల నిర్వహణా వ్యాపారంలో కళ ఎంత తీవ్రంగా పాల్గొంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో పౌర సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, ‘హేతుబద్ధమైన’ బూర్జువా సమాజం అభివృద్ధి చెందిన తరువాత, కెథార్సిను మొదట్లో తిరస్కరించిన తరువాత మానసిక ఉద్వేగాల దృష్టి తో పునర్నిర్వచించారు. గోథే దృష్టిలో కెథార్సిస్‌లో ప్రధాన అంశం సయోధ్య, సామరస్యాలను ప్రేక్షకుల మధ్య కంటే స్టేజిపై ఉన్న పార్టీల మధ్య సాధించడం. అది ఒక సృజనాత్మక ప్రక్రియ. కళాకారుడికి కళా సృజన అనేది కూడా ఒక విధమైన కెథార్టిక్ ప్రాసెస్.

జోనాథన్ లియర్ అనే వ్యాఖ్యత, కెథార్సిస్‌కి ‘ఋతుస్రావం’ అనే అర్ధం వచ్చేటట్టు చెప్పాడు. ఉద్వేగాలని విడుదల చేసే ఒక సహజ ప్రక్రియగా చూశాడు. కెథార్సిస్‌ను ప్రక్షాళనగా, శుద్దీకరణగా, విద్య గా నిర్వచించారు. అయితే ‘ఫో రం థియేటర్’ సిద్ధాంతకర్త అగస్టో బోల్ అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతాన్ని ఒక సాంస్కృతిక రక్షణ కవాటంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల మనసులని ఖాళీ చేసి సురక్షితంగా ప్రశాంతంగా ఉంచుతుంది రాజకీయపరమైన తిరుగుబాటు చేసే బదులు. అతని వాదన ప్రకారం, విషాద నాటకం తన ప్రేక్షకులను దానిదైన స్వంత భ్రమాన్విత స్థలంలోకి లాక్కుని వెళుతుంది. దైనందిన జీవిత తీర్పులను కాల్పనిక వాటితో భర్తీ చేస్తుంది. అందువల్ల అతను పాసివ్ కెథార్సిస్‌ని చాలెంజ్ చేస్తాడు. థియేటర్‌ని మార్పుకి ఒక రిహార్సల్ స్థలంగా ఉండాలి అంటాడు.

తరువాత కాలంలో కెధార్సిస్ సిద్ధాంతాన్ని సైకాలజీలో కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మన్ పండితులు కెథార్సిస్ ప్రక్రియని రోగ సంబంధమైన ఆవేశాల బహిష్కరణ అని భావించారు. ఇది నాటకం చూసిన ప్రేక్షునికిలో కలిగే ప్రతిస్పందన కంటే భిన్నమైనది. ఫ్రాయిడ్ బ్రూయర్‌తో కలసి హిస్టీరిక్స్ అంటే నరాల బలహీనతల గల వ్యక్తులు కోసం ఒక చికిత్సను అభివృద్ధి చేసాడు. దీనిని వారు ‘క్యాథర్టిక్ మెథడ్’ అని పిలిచారు. ఈ కారణంగా సామాజిక సంపర్కంతో సంబంధం లేకుండా, కెథార్సిస్ అనేది వ్యక్తిగత చికిత్సకి సంబంధించిన పదంగా మార్పు చెం దింది. ఈ విధంగా కెథార్సిస్ పని ప్రక్షాళన చేయడమే కాకుండా తీవ్ర భావోద్వేగ అనుభవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రాచుర్యం పొందడంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు.

– గోవింద శివ్వాల