
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై విమానం ఆగింది. రాయపూర్ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన 2 విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టేక్ ఆఫ్ కావాల్సిన మరో మూడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.